పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ | Sp observed pushkar ghats | Sakshi
Sakshi News home page

పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

Jul 24 2016 11:41 PM | Updated on Sep 4 2017 6:04 AM

పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

పుష్కర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

మండలంలో కృష్ణా పుష్కరాలు జరిగే ప్రాంతాలను ఆదివారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సందర్శించారు.

ఇర్కిగూడెం(దామరచర్ల) : మండలంలో కృష్ణా పుష్కరాలు జరిగే ప్రాంతాలను ఆదివారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సందర్శించారు.   ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి, ముదిమాణిఖ్యంలో నిర్మిస్తున్న స్నాన ఘాట్ల పనులతో పాటు పార్కింగ్‌ స్థలాలు, హోల్డింగ్‌ పాయింట్ల ఏర్పాట్లను  పరిశీలించారు. ఇక్కడకు ఎంత మంది భక్తులు వచ్చే వీలుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట రూరల్‌ సీఐ రవీందర్, ఎస్‌ఐ చరమంద రాజు, పీఆర్‌ ఏఈ ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement