రోమ్‌లో కాశీ! | Italian artist Giampaolo Tomassetti presented a painting of Varanasi ghats | Sakshi
Sakshi News home page

రోమ్‌లో కాశీ!

May 23 2026 6:29 AM | Updated on May 23 2026 6:29 AM

Italian artist Giampaolo Tomassetti presented a painting of Varanasi ghats

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌

ఇటలీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటాలియన్‌ చిత్రకారుడైన గియాంపౌలో టొమాసెట్టిని కలవడం విశేషంగా మారింది. ‘ఎవరీ టొమాసెట్టి?’ అనే ఆసక్తి మొదలైంది. మన భారతీయ సంస్కృతితో ఆయనకు  ఎంతో అనుబంధం ఉంది. తాను చిత్రించిన వారణాసి ఘాట్‌ల పెయింటింగ్ ను మన ప్రధానికి బహుకరించారు. ఈ చిత్రాన్ని చూస్తూ...‘రోమ్‌లో కాశీ దృశ్యం’ అని ఆనందించారు మోదీ.

 భారతీయ నాగరికత, హిందూ ఇతిహాసాలపై టొమాసెట్టి పెయింటింగ్స్‌ వేశారు. ప్రతిష్ఠాత్మకమైన మహాభారతం ప్రాజెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతోమంది కళాభిమానులకు సుపరిచితులయ్యారు.  ఈ ప్రాజెక్ట్‌ కోసం పెయింటింగ్స్‌ వేయడానికి ముందు దాదాపు అయిదు సంవత్సరాలు మహాభారతాన్ని అధ్యయనం చేశారు టొమాసెట్టి. 2008 నుంచి 2013 వరకు మహాభారతంలోని ఘట్టాల ఆధారంగా 23 భారీ పెయింటింగ్స్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement