Sakshi News home page

సౌత్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ అథ్లెటిక్స్‌కు ఎనిమిది మంది ఎంపిక

Published Fri, May 26 2017 11:25 PM

సౌత్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ అథ్లెటిక్స్‌కు ఎనిమిది మంది ఎంపిక

మామిడికుదురు : నేపాల్‌లోని భూటాన్‌లో ఈనెల 29 నుంచి 30 వరకు జరిగే సౌత్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ పోటీలకు ఆరుగురు, అథ్లెటిక్స్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. హర్యానాలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన రూరల్‌ నేషనల్‌ బాక్సింగ్, తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకోవడం ద్వారా వీరిని ఏషియన్‌ పోటీలకు ఎంపిక చేశారని అంతర్జాతీయ బాక్సింగ్‌ రిఫరీ చిట్టూరి చంద్రశేఖర్, అథ్లెటిక్స్‌ కోచ్‌ వి.పృధ్వీరాజ్‌ శుక్రవారం తెలిపారు. సబ్‌ జూనియర్స్‌ విభాగంలో గెద్దాడ గ్రామానికి చెందిన సీహెచ్‌ యోగితాకుమారి, చిట్టూరి సాయివరలక్ష్మి, పి.గన్నవరం మండలం బెల్లంపూడికి చెందిన చీకురుమిల్లి హాసిని, సఖినేటిపల్లికి చెందిన నల్లి రాకేష్, మలికిపురానికి చెందిన అల్లూరి మనోజ్‌వర్మ, తాటిపాకకు చెందిన గుబ్బల గణేష్‌బాబు ఏషియన్‌ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ ఆరుగులు విద్యార్థులు హర్యానాలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు గెలుపొందారన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన నేషనల్‌ రూరల్‌ అథ్లెటిక్స్‌లో నగరం గ్రామానికి చెందిన చిట్టూరి యువశంకర్‌ అండర్‌–17 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్, అండర్‌–14 విభాగంలో నాగాబత్తుల లితిన్‌ 100 మీటర్ల రన్నింగ్‌  పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకోవడం ద్వారా ఏషియన్‌ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.  ఎంపికైన విద్యార్థులను స్థానికులు అభినందించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement