గడువు తీరిన చాక్లెట్ల రూపు మార్చి.. | sot police attacked dupicate chocolate making center | Sakshi
Sakshi News home page

గడువు తీరిన చాక్లెట్ల రూపు మార్చి..

Apr 5 2016 6:12 PM | Updated on Aug 20 2018 4:44 PM

గడువు తీరిన చాక్లెట్ల రూపు మార్చి.. - Sakshi

గడువు తీరిన చాక్లెట్ల రూపు మార్చి..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పోలీసుల కథనం మేరకు... అఫ్సర్ అనే వ్యక్తి  గడువు తీరిపోయిన చాక్లెట్‌లను ఏజెన్సీల ద్వారా సేకరించి సులేమాన్‌నగర్‌లోని గోదాముకు తరలించేవాడు. అనంతరం వివిధ రసాయనాలను వినియోగించి చాక్లెట్‌లను తయారు చేయడం ప్రారంభించారు.

 

ప్రముఖ కంపెనీలతో పాటు లోకల్ కంపెనీల పేరు మీద భారీ యంత్రాలతో నిమిషాలలోనే వేలాది చాక్లెట్‌లను తయారు చేస్తున్నాడు. దీనిపై స్థానికులు ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం అందించగా...  ఈరోజు మధ్యాహ్నం గోదాములో పోలీసులు సోదాలు నిర్వహించి అఫ్సర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన ముడిసరుకు, రెండు భారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement