వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి | sons jobs must | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి

Jul 17 2016 7:34 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న కార్మికుల వారసులు

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న కార్మికుల వారసులు

గోదావరిఖని : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం నాయకులు కోరారు. ఈమేరకు ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదన్నారు.

గోదావరిఖని : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని సింగరేణి కార్మిక బిడ్డల సంఘం నాయకులు కోరారు. ఈమేరకు ఆర్టీసీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదన్నారు. రోజురోజుకు కార్మికులు అనారోగ్యంతో విధులు నిర్వహించలేక.. మెడికల్‌ అన్‌ఫిట్‌ కాలేక నలిగిపోతున్నారని తెలిపారు.
కార్మికుల సర్వీసు ముగుస్తుందని, వారసుల వయసు దాటి పోతుందనే బాధ కార్మికుల్లో ఉందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రొళ్ల నరేష్, ఉపాధ్యక్షుడు ఆడెపు కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు రాసమల్ల రమేశ్, పెనుగొండ నాగరాజు, ఆడెపు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement