అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు | son shoots mother in guntur district | Sakshi
Sakshi News home page

అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు

Sep 2 2015 11:32 AM | Updated on Aug 24 2018 2:36 PM

అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు - Sakshi

అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లినే రివాల్వర్‌తో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు.

గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లినే రివాల్వర్‌తో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని కాకుమాను మండలం కొమ్మూరులో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్‌వలి (47) ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు.

ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి మద్యానికి బానిస అయి తరచూ తల్లి ఫజ్లూం(65)తో ఘర్షణకు దిగివాడు. అక్రమంలో ఈ రోజు కూడా తల్లితో ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో తన లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement