పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డుల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు.
– మునిన్సపల్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే గౌరు చరిత విన్నపం
కల్లూరు (రూరల్): పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డుల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కర్నూలుకు ప్రతి రోజూ మంచినీటిని సరఫరా చేస్తూ.. పాణ్యం నియోజకవర్గంలోని 14 వార్డులకు మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అర్ధరాత్రి ఏ సమయంలో నీటిని సరఫరా చేస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కర్నూలు ప్రజలు ఇంటి, నీటి పన్నులు సక్రమంగా ఎలా చెల్లిస్తున్నారో అదే విధంగా పాణ్యం నియోజకవర్గంలోని ప్రజలు కూడా చెల్లిస్తున్నారని వివరించారు. మంచినీటి సరఫరా విషయంలో వివక్ష చూపొద్దని, ప్రజలు కన్నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.