సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం | Software engineer disappear | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

Jul 26 2016 7:39 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇంటికి వచ్చిన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండాపోయాడు.

 ఇంటికి వచ్చిన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. బాగ్ అంబర్‌పేట సాయిబాబా నగర్‌లో నివసించే కె. రమేష్‌నాయుడు(23) అతని భార్య శ్రీవిద్యతో ఉంటున్నాడు. ఇతను ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.

 

కాగా ఈ నెల 24 వీరి ఇంటికి రమేష్ స్నేహితుడైన లక్ష్మణ్ వచ్చాడు. కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ ఇంట్లో నుంచి పని ఉందంటూ బయటకు వెళ్లారు. అప్పటి నుంచి రమేష్‌నాయుడు తిరిగి రాకపోవడంతో అతని కోసం అన్నిచోట్లా వెదికారు. ప్రయోజనం లేకపోవటంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement