సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Software engineer commits suicide | Sakshi
Sakshi News home page

సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Jan 19 2017 2:58 AM | Updated on Oct 22 2018 7:50 PM

గండిపేట్‌ చెరువులో దూకి సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

రాజేంద్రనగర్‌: గండిపేట్‌ చెరువులో దూకి  సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌  ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సందీప్‌ సింగ్‌(27) బెంగళూర్‌లో ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న బెంగళూర్‌ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొలేకపోతున్నానని బాధపడుతుండటంతో తల్లిదండ్రులు అతడిని ఓదార్చారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన సందీప్‌ సింగ్‌ గండిపేట్‌ ప్రాంతానికి వచ్చి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాహనంతో పాటు గట్టు వద్ద సెల్‌ఫోన్‌ వివరాలతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement