సాఫ్ట్‌బాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం | soft ball | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

Jul 27 2016 10:58 PM | Updated on Sep 4 2017 6:35 AM

సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర బాలికల జట్టుకు బుధవారం శిక్షణ శిబిరం ప్రారంభించారు. సుద్దపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

డిచ్‌పల్లి : సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర బాలికల జట్టుకు బుధవారం శిక్షణ శిబిరం ప్రారంభించారు. సుద్దపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చేనెల రెండో తేదీ వరకు శిబిరం కొనసాగుతుందని జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌ తెలిపారు. 6 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని ఎల్‌పీ యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ స్థాయి టోర్నీలో రాష్ట్ర జట్టు పాల్గొంటుందని పేర్కొన్నారు. బాలికల జట్టు కోచ్‌గా పీఈటీ గంగామోహన్‌ వ్యవహరిస్తున్నారు. శిబిరం ప్రారంభోత్సవంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సరోజినిదేవి నాయుడు, పీడీ నీరజ, పీఈటీ జోత్స్న పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement