ప్రజాసాధికార సర్వే ముగిసిందని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
ముగిసిన ప్రజాసాధికార సర్వే
Nov 1 2016 12:03 AM | Updated on Sep 4 2017 6:48 PM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే ముగిసిందని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే చేయని కుటుంబాలు.. సర్వేకోసం రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వవచ్చని.. ఈ విధంగా మూడు రోజుల పాటు అంటే నవంబర్ 3 వరకు గడువు ఉందన్నారు. వినతులు ఇచ్చిన వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే చేస్తారని వివరించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో 43,42,629 మందిని సర్వే చేయాల్సి ఉండగా 33,49,817 మందిని మాత్రమే సర్వే చేశారు. మొత్తంగా 77.4 శాతం మాత్రమే సర్వే జరిగింది.
Advertisement
Advertisement