స్మార్ట్ ఫోన్‌కు 2వేల నోటు చూపితే మోదీ ప్రసంగం | Smart phone 2 shows the note of Modi's speech | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్‌కు 2వేల నోటు చూపితే మోదీ ప్రసంగం

Nov 20 2016 3:16 AM | Updated on Aug 15 2018 2:30 PM

స్మార్ట్ ఫోన్‌కు 2వేల నోటు చూపితే మోదీ ప్రసంగం - Sakshi

స్మార్ట్ ఫోన్‌కు 2వేల నోటు చూపితే మోదీ ప్రసంగం

స్మార్ట్ ఫోన్‌లో ఓ యాప్ ఓపెన్ చేసి, రూ.2 వేల నోటు వైపు చూపితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది.

పులివెందుల రూరల్: స్మార్ట్ ఫోన్‌లో ఓ యాప్ ఓపెన్ చేసి, రూ.2 వేల నోటు వైపు చూపితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘మోడి కీ నోటు’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే కెమెరా ఆన్ అవుతుంది.

రూ.2 వేల నోటు వెనుక భాగం (మంగళ్‌యాన్ ఉన్న వైపు) కెమెరాలో కనిపించే విధంగా స్మార్ట్ ఫోన్‌ను పట్టుకుంటే ప్రధాని మోదీ ప్రసంగం వస్తుంది. రూ.2 వేలు, రూ.500 కొత్త నోట్ల గురించి నరేంద్ర మోదీ ఇంగ్లిషులో మాట్లాడుతుండటం కనిపిస్తుంది. ప్రస్తుతం విడుదలైన రూ.2000 నోటులో ఈ ప్రత్యేకత ఉండటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement