ఎస్‌కేయూ జట్టు బోణి | sku team won | Sakshi
Sakshi News home page

ఎస్‌కేయూ జట్టు బోణి

Jan 3 2017 11:39 PM | Updated on Nov 6 2018 5:13 PM

అంతర్‌ కళాశాలల యూనివర్శిటీ క్రికెట్‌ పోటీల్లో అనంత ఎస్‌కే యూనివర్శిటీ జట్టు బోణి కొట్టింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అంతర్‌ కళాశాలల యూనివర్శిటీ క్రికెట్‌ పోటీల్లో అనంత ఎస్‌కే యూనివర్శిటీ జట్టు బోణి కొట్టింది. చెన్నైలోని హిందుస్థాన్‌ యూనివర్శిటీలో జరుగుతున్న అంతర్‌ కళాశాలల క్రికెట్‌ పోటీల్లో మొదటి మ్యాచ్‌లో సత్యభామ యూనివర్శిటీపై మన జట్టు విజయం సాధించిందని జట్టు మేనేజర్‌ చంద్రమోహన్‌ తెలిపారు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన సత్యభామ జట్టు 80 పరుగులకే ఆలౌటైందని చెప్పారు. ఎస్‌కేయూ జట్టులోని వినయ్‌ (ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల) 5 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌కేయూ జట్టు 1 వికెట్‌ కోల్పోయి 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుందని చెప్పారు. జట్టులో సంపత్‌ 41 , ప్రవీణ్‌ 24, వినయ్‌ 5 పరుగులు చేశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement