breaking news
team won
-
ఎస్కేయూ జట్టు బోణి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అంతర్ కళాశాలల యూనివర్శిటీ క్రికెట్ పోటీల్లో అనంత ఎస్కే యూనివర్శిటీ జట్టు బోణి కొట్టింది. చెన్నైలోని హిందుస్థాన్ యూనివర్శిటీలో జరుగుతున్న అంతర్ కళాశాలల క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్‌లో సత్యభామ యూనివర్శిటీపై మన జట్టు విజయం సాధించిందని జట్టు మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సత్యభామ జట్టు 80 పరుగులకే ఆలౌటైందని చెప్పారు. ఎస్కేయూ జట్టులోని వినయ్ (ఎస్ఎస్బీఎన్ కళాశాల) 5 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్కేయూ జట్టు 1 వికెట్ కోల్పోయి 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుందని చెప్పారు. జట్టులో సంపత్ 41 , ప్రవీణ్ 24, వినయ్ 5 పరుగులు చేశారన్నారు. -
చెన్నైలో స్టార్ క్రికెట్ సందడి
ఫైనల్లో సూర్య జట్టు గెలుపు చెన్నై: క్రికెట్ మైదానంలో దక్షిణ భారత సినిమా స్టార్లు తళుక్కుమన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం స్టార్స్ క్రికెట్ నిర్వహించారు. ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన మ్యాచ్‌లకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సినీ నటీనటులు తరలివచ్చారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సమక్షంలో విశ్వనటుడు కమలహాసన్ తొలిమ్యాచ్‌కు టాస్ వేసి స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆరంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు రసవత్తరంగా జరిగిన పోటీల్లో ఎనిమిది జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా విలక్షణ నటుడు విక్రమ్ పుట్టినరోజును సంబరంగా జరుపుకున్నారు. మమ్ముట్టితోపాటు నాజర్, విశాల్, బాలకృష్ణ, శ్రీయ తదితరులు కేక్‌ను విక్రమ్‌కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్‌లో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు, జీవా తంజై వారియర్స్ జట్లు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోటీలకు అక్కినేని నాగార్జున హాజరయ్యారు.