మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలుడు, తన అక్క చేతిలో హతమయ్యాడు.
కొడంగల్(మహబూబ్ నగర్): మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలుడు, తన అక్క చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని కొడంగల్ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని చిట్లపల్లి గ్రామంలో అబ్దుల్ సమీర్‌ను అక్క ఆసియా బేగం హత్య చేసింది. సవతి తల్లి కుమారుడైన సమీర్‌ను ఆసియా గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.