
సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్
సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్కు పిలుపు నిచ్చింది.
కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా సాధన కోసం జిల్లా జేఏసీ మంగళవారం స్థానిక డివిజన్లో 48 గంటల బంద్కు పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. బస్సులను నిలిపివేశారు. అలాగే స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్పై జేఏసీ సభ్యులు దాడి చేశారు.
ఈ ఘటనలో పెట్రోల్ బంక్ అద్దాలు ధ్వంసమైనాయి. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇరువైపులా రోడ్లుపై టైర్లు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కోసం పట్టణంలోని స్థానిక వర్తక, వాణిజ్య సంస్థలు, విద్యాలయాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సెలవు ప్రకటించాయి. అయితే కోరుట్ల రెవెన్యూ డివిజన్లో కూడా 48 గంటల బంద్కు డివిజన్ సాధన కమిటీ మంగళవారం పిలుపు నిచ్చింది.