నా సోదరిని వాళ్లే చంపేశారు...

నా సోదరిని వాళ్లే చంపేశారు... - Sakshi


వరంగల్ : సారిక మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని సారిక సోదరి అర్చన ఆరోపించారు. గతంలోనూ సారికను చాలాసార్లు వేధించారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. సారిక స్వస్థలం నిజామాబాద్ జిల్లా అడ్డూరు ఎల్లారెడ్డి. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్త మామ, భర్తే సారికను హతమార్చారని సోదరి అర్చన వ్యాఖ్యానించారు.


 


రాజయ్య  కుటుంబ సభ్యులను వదలొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా కూతురితో పాటు మనవళ్లు అగ్నికి ఆహుతి అవటంతో సారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అత్త, మామ, భర్త...తన బిడ్డను మొదట్నించి వేధిస్తున్నారని మృతురాలు సారిక తల్లి లలిత కంటతడి పెట్టారు. దసరా పండుగకు తమ ఇంటికి వచ్చి వెళ్లిన బిడ్డ...ఇప్పుడు విగత జీవిగా మారిందంటూ విలపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top