కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే | servey for water sump construction | Sakshi
Sakshi News home page

కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే

Oct 4 2016 10:41 PM | Updated on Sep 4 2017 4:09 PM

కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే

కొండపై నీటిసంపు నిర్మాణానికి సర్వే

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై భక్తులకు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దాదాపు 10 లక్షల లీటర్ల సంపును నిర్మించేందుకు మంగళవారం సర్వే చేశారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై భక్తులకు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దాదాపు 10 లక్షల లీటర్ల సంపును నిర్మించేందుకు మంగళవారం సర్వే చేశారు. శివాలయం పక్కన ఉన్న నీటి ట్యాంకును కూల్చేసి దాని స్థానంలోనే నేల అడుగు భాగంలో విశాలమైన నీటి సంపును నిర్మాణం చేయడానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ పనులు దసరా రోజు నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సురేందర్‌రెడ్డి, ఎస్‌సీ రమణానాయక్, ఈఓ గీతారెడ్డి, దేవస్థానం అధికారులు డీఈ దయాకర్‌రెడ్డి, ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పాపారావు, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement