రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక | Selection of State Sports | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Sep 10 2016 12:35 AM | Updated on Sep 4 2017 12:49 PM

నారాయణపేట రూరల్‌ : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ స్టేడియంలో ఈ నెల 10 నుంచి మూడురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్‌ – 17 ఖోఖో పోటీలకు మండలంలోని జాజాపూర్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ ఎస్‌ వి ద్యార్థులు స్వాతి, ప్రతాప్‌లో ఈనెల 6న పా లమూరులో జరిగిన ఎంపికపోటీల్లో ప్రతిభ చూపారు. శుక్రవారం విద్యార్థులను జీహెచ్‌ఎం రాజేంద్రకుమార్, పీఈటీ వెంకటేష్‌లు అభినందించారు.

కోయిల్‌కొండ: రాష్ట్రస్థాయి అండర్‌–14 నెట్‌ బాల్‌ పోటీలకు మండలంలోని గార్లపహాడ్‌ ఉన్నతపాఠశాలకు చెందిన 11మంది విద్యార్థులు ఎంపికయ్యారు.  సోని, గంగోత్రి, హెచ్‌ శిరీష, కె.శిరీష, గీత, శివగంగ, భారతి, రజిత, అనిత, సువర్ణ, సంజీవలు ఎంపికయ్యినట్లు పాఠశాల ఇ¯Œæచార్జ్‌ హెచ్‌ఎం గోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీగ్రౌండ్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌–14 నెట్‌ బాల్‌లో జిల్లా జట్టు తరుపున విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు.  అభంగపట్నం ప్రాథమికోన్నత ఉన్నతపాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి తన తండ్రి వెంకటరమణ స్మారకార్థం ఎంపికైన విద్యార్థులకు బూట్లు, యూనిఫాంలను శుక్రవారం అందజేశారు. 
రాష్ట స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థిని ఎంపిక
గోటూర్‌(ధన్వాడ): మండలంలోని గోటూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వెంకటమ్మ అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పురుషోత్తం తెలిపారు.  శనివారం రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే ఖోఖో పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందని చెప్పారు.  ఈ సందర్భంగా వెంకటమ్మను ఉపాధ్యాయ బృందం అభినందించారు. 

Advertisement

పోల్

Advertisement