రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక | selection for State-level chess tournament | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

Sep 9 2016 12:51 AM | Updated on Aug 29 2018 4:18 PM

మండలంలోని చిన్నకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం కుకుడాల గోవర్ధన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిన్నకాపర్తి(చిట్యాల): మండలంలోని చిన్నకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం కుకుడాల గోవర్ధన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో అండర్‌–14 విభాగంలో ఆవుల అర్చన, రూపని సమత, అండర్‌–17 విభాగంలో తూముకుంట్ల పూజ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థినులను గ్రామ సర్పంచ్‌ వలిగొండ లింగమ్మ, ఉపసర్పంచ్‌ రుద్రారపు శ్రీను, ఎంపీటీసీ రుద్రారపు భిక్షపతి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పాలకూరి వెంకటేశం, ఉపాధ్యాయులు ఆభినందించారు.
 
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement