హైదరాబాద్‌లోని సైక్లింగ్ అకాడమీకి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు సంజీవ్‌కుమార్, జంగపెల్లి వెంకటనర్సయ్య తెలిపారు.
సైక్లింగ్ అకాడమీకి ఎంపిక
Aug 1 2016 11:33 PM | Updated on Oct 2 2018 7:58 PM
హుస్నాబాద్‌రూరల్: హైదరాబాద్‌లోని సైక్లింగ్ అకాడమీకి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు సంజీవ్‌కుమార్, జంగపెల్లి వెంకటనర్సయ్య తెలిపారు. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన శారీరకదారుఢ్య పరీక్షలో నెగ్గి అకాడమీకి ఎంపికయ్యారని చెప్పారు. హుస్నాబాద్ మండలానికి చెందిన సాయితరుణ్(గౌరవెల్లి), కట్టమీది జీవన్, టి.నవీన్(రామవరం), సూర్యతేజ(జెయింట్ జోసఫ్), కె.దీపక్‌తేజ, అభిరామ్ (కరీంనగర్)కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వారి ఎంపికపై మారంపెల్లి అర్జున్, రంగానాయక్ హర్షం వ్యక్తం చేశారు.
Advertisement


