‘బర్డ్’ డైరెక్టర్ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్య | security guard murderd in tirupathi | Sakshi
Sakshi News home page

‘బర్డ్’ డైరెక్టర్ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్య

Dec 10 2016 8:54 AM | Updated on Jul 30 2018 8:29 PM

‘బర్డ్’ డైరెక్టర్ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్య - Sakshi

‘బర్డ్’ డైరెక్టర్ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్య

తిరుపతిలో ఓ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు.

తిరుపతి: తిరుపతిలో ఓ ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. స్థానిక కాకతీయ నగర్‌లోని బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిజేబుల్డ్(బర్డ్) ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఇంట్లో చల్లా శేషయ్య అనే సెక్యూరిటీ గార్డు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో హత్యకు గురయ్యాడు.

ఇతను యాగప్పరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందినవాడు. తలపై బండరాళ్లతో, రోకలిబండతో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతను ‘స్విమ్స్’లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడని, ఈ ఇంట్లో ‘బర్డ్’ డెరైక్టర్ తల్లిదండ్రులు ఉంటున్నారని తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement