గుట్టుగా గుట్కా దందా! | secret quid scam in siddipet | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుట్కా దందా!

Mar 6 2016 1:05 AM | Updated on Sep 3 2017 7:04 PM

గుట్టుగా గుట్కా దందా!

గుట్టుగా గుట్కా దందా!

సిద్దిపేట.. గుట్కా మాఫియాకు కేంద్రమవుతోంది. మహారాష్ర్ట నుంచి సరుకు తీసుకొస్తున్న వ్యాపారులు ఇక్కడి నుంచే దందా చేస్తున్నారు.

సిద్దిపేటలో మాఫియా ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా
సిద్దిపేట నుంచే ఇతర ప్రాంతాలకు సరుకు సరఫరా
ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు చిక్కిన లక్షల విలువైన ప్యాకెట్లు

 సిద్దిపేట.. గుట్కా మాఫియాకు కేంద్రమవుతోంది. మహారాష్ర్ట నుంచి సరుకు తీసుకొస్తున్న వ్యాపారులు ఇక్కడి నుంచే దందా చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో అక్రమ వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుపడ్డాయంటే  ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.   -సిద్దిపేట

సిద్దిపేట: సిద్దిపేట కేంద్రంగా గుట్కా మాఫీయా గుట్టుగా సాగిపోతోంది. పోలీసుల తనిఖీలు అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారం లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుపడ్డాయంటే పట్టణంలో ఈ దందా ఏ మేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోనే సిద్దిపేట పెద్ద వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడికి పట్టణంతో పాటు పరిసర మండలాలు, వరంగల్ పరిధిలోని చేర్యాల, బచ్చన్నపేట, కరీంగనర్ జిల్లా సిరిసిల్ల, ఇల్లంతకుంట, బెజ్జెంకి, ముస్తాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. పాన్‌షాప్ సామగ్రి, జర్దా, పాన్‌మసాలాలు, సిగరెట్లు విక్రయించే హోల్‌సేల్ దుకాణాలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సంబంధిత వ్యాపారులు మహరాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్లు కొనుగోలు చేసి ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈక్రమంలో గుట్కాలపై నిషేధం ఉండటంతో అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న కొందరు ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు పట్టుపడ్డారు.

 యథేచ్ఛగా అమ్మకాలు
ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు తరలించడమే కాకుండా వ్యాపారులు స్థానిక దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. నిషేధాన్ని ఆసరా చేసుకుని రెండితలు ధరలు చేసి అమ్ముతున్నారు. అధికారుల నిఘా లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చిన అంశం. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిని సంప్రదించగా.. తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అక్రమంగా గుట్కా వ్యాపారం చేసేవారిపై కఠిన చర ్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement