breaking news
Quid Mafia
-
గుట్టుగా గుట్కా దందా!
♦ సిద్దిపేటలో మాఫియా ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా ♦ సిద్దిపేట నుంచే ఇతర ప్రాంతాలకు సరుకు సరఫరా ♦ ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు చిక్కిన లక్షల విలువైన ప్యాకెట్లు సిద్దిపేట.. గుట్కా మాఫియాకు కేంద్రమవుతోంది. మహారాష్ర్ట నుంచి సరుకు తీసుకొస్తున్న వ్యాపారులు ఇక్కడి నుంచే దందా చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో అక్రమ వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుపడ్డాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -సిద్దిపేట సిద్దిపేట: సిద్దిపేట కేంద్రంగా గుట్కా మాఫీయా గుట్టుగా సాగిపోతోంది. పోలీసుల తనిఖీలు అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారం లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుపడ్డాయంటే పట్టణంలో ఈ దందా ఏ మేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోనే సిద్దిపేట పెద్ద వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడికి పట్టణంతో పాటు పరిసర మండలాలు, వరంగల్ పరిధిలోని చేర్యాల, బచ్చన్నపేట, కరీంగనర్ జిల్లా సిరిసిల్ల, ఇల్లంతకుంట, బెజ్జెంకి, ముస్తాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. పాన్‌షాప్ సామగ్రి, జర్దా, పాన్‌మసాలాలు, సిగరెట్లు విక్రయించే హోల్‌సేల్ దుకాణాలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సంబంధిత వ్యాపారులు మహరాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్లు కొనుగోలు చేసి ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈక్రమంలో గుట్కాలపై నిషేధం ఉండటంతో అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న కొందరు ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు పట్టుపడ్డారు. యథేచ్ఛగా అమ్మకాలు ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు తరలించడమే కాకుండా వ్యాపారులు స్థానిక దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. నిషేధాన్ని ఆసరా చేసుకుని రెండితలు ధరలు చేసి అమ్ముతున్నారు. అధికారుల నిఘా లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చిన అంశం. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిని సంప్రదించగా.. తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అక్రమంగా గుట్కా వ్యాపారం చేసేవారిపై కఠిన చర ్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గుట్కా వ్యాపారానికి గుడ్‌బై చెప్పాల్సిందే!
విజయవాడ సిటీ : నగర పోలీసులు గుట్కా మాఫియాను తరిమి కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నగరంలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేసిన మాఫియా నేతలను కోర్టు మెట్లు ఎక్కించిన పోలీసులు, విచారణలో భాగంగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇదే సమయంలో గుట్కా మాఫియాకు సహకరించిన వారిపై కూడా ప్రత్యేక దృష్టిసారించినట్టు విశ్వసనీయ సమాచారం. నగరంలో గుట్కా వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటూ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వీరిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించరాదనేది సీపీ నిర్ణయం. ఈ క్రమంలోనే తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే వీరిపై ఉక్కుపాదం మోపారు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. టన్నుల కొద్దీ గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గుట్కా హోల్‌సేల్ వ్యాపారులైన చంద్రశేఖర్, కామేశ్వరరావుపై కేసులు నమోదు చేశారు. వీరు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో పూర్తి స్థాయి వివరాల సేకరణకు రెండుమార్లు పోలీసు విచారణకు రప్పించారు. తిరిగి మరోసారి విచారణకు పిలిచే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. గుట్కా మాయంపై దృష్టి మాఫియా ఆర్థిక మూలాలను దెబ్చకొట్టినా వ్యాపారం మానుకోక పోవడంపై పోలీసు కమిషనర్ సవాంగ్ ఆరా తీయగా పట్టుబడిన సరుకులో కొంత ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా వీరికి చేరుతున్నట్టు గుర్తించారు. నిర్దారణ కోసం ఆదేశించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరిపి వాస్తవమేనని తేల్చారు. ఇటీవల పోలీసు విచారణకు వచ్చిన గుట్కా విక్రేతలు కూడా దీనిని ధృవీకరించినట్టు తెలిసింది. దీంతో ఆ కేసుపై మరోసారి దృష్టిసారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పట్టుబడిన సరుకును తిరిగి వారికి చేర్చడం వెనుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు.