రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌డీజీఎస్‌ విద్యార్థులు | sdgs students to state level competetions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్‌డీజీఎస్‌ విద్యార్థులు

Sep 18 2016 12:09 AM | Updated on Sep 4 2017 1:53 PM

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు హిందూపురం పట్టణంలోని ఎస్‌డీజీఎస్‌ కళాశాలకు చెందిన శరత్‌కుమార్, అరుణ్‌కుమార్‌ ఎంపికైనట్లు కళాశాల పీడీ హేమంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

హిందూపురం టౌన్‌ : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు హిందూపురం పట్టణంలోని ఎస్‌డీజీఎస్‌ కళాశాలకు చెందిన శరత్‌కుమార్, అరుణ్‌కుమార్‌ ఎంపికైనట్లు కళాశాల పీడీ హేమంత్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం విద్యార్థులను పీడీతో పాటు ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు అభినందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ అండర్‌–19 ఏపీ స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ పోటీల్లో ఎస్‌డీజీఎస్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషమన్నారు. త్వరలో చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement