జాతీయ బ్యాంకులు నిర్వహించే ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ ఆ««దl్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ బ్యాంకులు నిర్వహించే ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ ఆ««దl్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని బాలాజీనగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకోసం దరఖాస్తు చేసుకున్న జిల్లా అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.