సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం | samachara chattam | Sakshi
Sakshi News home page

సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం

Oct 12 2016 11:47 PM | Updated on Sep 4 2017 5:00 PM

సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం

సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం

సమాచార హక్కు చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ విషయంపై న్యాయస్థానంలో పోరాడతామని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక న్యాయ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు అన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చి 11 ఏళ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.

 
  • చట్టం ప్రచార ఐక్యవేదిక నేత సుబ్బారావు
గొల్లప్రోలు :
సమాచార హక్కు చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ విషయంపై న్యాయస్థానంలో పోరాడతామని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక న్యాయ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు అన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చి 11 ఏళ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకూ ఈ చట్టం సామాన్య ప్రజలకు చేరువ కాకపోవడం ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు చేతన కోరారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిని చూపాలన్నారు. ఈ ^è ట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా మహిళా అధ్యక్షురాలు నాళం అండాళ్‌ తెలిపారు. అవినీతిలో దేశం 72 స్థానంలో ఉందని, ఈ సంఖ్య తగ్గేందుకు ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని, ఇది ఈ చట్టంతోనే సాధ్యమవుతుందని మండల అధ్యక్షుడు భరత్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ నెంబర్‌–1 పాఠశాలలో వారోత్సవాలను ప్రారంభించారు. ప్రచార ఐక్యవేదిక మండల అధ్యక్షుడు పడాల రతన్‌భరత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మహళా విభాగం ప్రధాన కార్యదర్శి కామిశెట్టి లలితాదేవి, న్యాయవాదులు కొశిరెడ్డి రామకృష్ణ, పి.సంతోష్‌కుమారి, జిల్లా కార్యదర్శులు వరదా నాగేశ్వరరావు, డాక్టర్‌ శేషగిరిరావు, మండల నాయకులు పెద్దిశెట్టి మహేష్, నారాయణమూర్తి, గొల్లపల్లి భద్రరావు, బుర్రా రామాంజనేయులు, దాసం చంద్రశేకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement