సాక్షి ఇండియా స్పెల్‌బీ కేటగిరి–1 విజేతలు వీరే | sakshi India Spell Bee -2016 Winners Announced | Sakshi
Sakshi News home page

సాక్షి ఇండియా స్పెల్‌బీ కేటగిరి–1 విజేతలు వీరే

Dec 24 2016 4:44 AM | Updated on Sep 4 2017 11:26 PM

స్పెల్‌ బీ ఇండియా సీఈవో శంకర్‌ నారాయణ, విజేతల తల్లిదండ్రులు

స్పెల్‌ బీ ఇండియా సీఈవో శంకర్‌ నారాయణ, విజేతల తల్లిదండ్రులు

‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌ బీ–2016 (కేటగిరీ–1, తెలంగాణ రాష్టం) విజేతలను ప్రకటించారు.

హైదరాబాద్‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌ బీ–2016 (కేటగిరీ–1, తెలంగాణ రాష్టం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు  సాక్షి ఇండియా స్పెల్‌బీ సీఈవో శంకర్‌నారాయణ, బీ మాస్టర్‌ విక్రమ్‌ బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషపై అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారికి ఇంగ్లిష్‌లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు గొప్ప ఆత్మ విశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

విజేతలు వీరే: ‘సాక్షి’ ఇండియా స్పెల్‌బీ పోటీల్లో ప్రథమ బహుమతిని హైదరాబాద్‌ క్యూట్‌ ఐలాండ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతువున్న అక్షత్‌నాయక్‌ కైవసం చేసుకున్నారు. అక్షత్‌కు బంగారు పతకంతో పాటు రూ.15 వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతిని హైదరాబాద్‌ భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌లో చదువుతున్న అనిమేష్‌.పి సాధించారు. అనిమేష్‌కు రజత పతకంతో పాటు రూ.10 వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ ప్యాక్‌ అందజేశారు.
తృతీయ బహుమతిని హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్న నక్షత్ర శంకర్‌ సాధించారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ.5 వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ప్యాక్‌ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement