ఈస్టర్ పండగను పురస్కరించుకుని ఈనెల 15 వ తేదీన కర్నూలు నగరంలో నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిటీ పాస్టర్స్ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ విలియం, సీనియర్ పాస్టర్ పాస్కల్ ప్రకాష్ పిలుపు నిచ్చారు.
15న రన్ ఫర్ జీసస్
Apr 8 2017 11:39 PM | Updated on Sep 5 2017 8:17 AM
కర్నూలు (టౌన్) ; ఈస్టర్ పండగను పురస్కరించుకుని ఈనెల 15 వ తేదీన కర్నూలు నగరంలో నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిటీ పాస్టర్స్ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ విలియం, సీనియర్ పాస్టర్ పాస్కల్ ప్రకాష్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక కోల్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో రన్ ఫర్ జీసస్ టీ–షర్టులను అవిష్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు పి. విజయకుమార్, నిర్వాహకులు డి.సుధీర్, రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు నరేష్, దేవేంద్రప్ప, అనిల్‌నాథ్, డేవిడ్‌పాల్ పాల్గొన్నారు.
Advertisement


