తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్ | TANA Mid Atlantic Hosts Joyful Easter Egg Hunt for Kids | Sakshi
Sakshi News home page

తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్

Apr 14 2026 10:41 PM | Updated on Apr 14 2026 10:41 PM

TANA Mid Atlantic Hosts Joyful Easter Egg Hunt for Kids

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్‌విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు.  ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.

ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.

మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. 

తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement