భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం | Rs one crore Worth Redwood logs seized | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Feb 3 2016 11:33 AM | Updated on Sep 26 2018 6:01 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి గ్రామ సమీపంలో పోలీసులు లారీలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు లారీలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా లారీలో తీసుకొస్తున్న 26 దుంగలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు దుంగలను తరలిస్తున్న తమిళ కూలీతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. కోటి(లారీతో సహా) వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement