పామిడిలో చోరీ | robery in pamidi | Sakshi
Sakshi News home page

పామిడిలో చోరీ

Mar 1 2017 12:02 AM | Updated on Sep 5 2017 4:51 AM

పామిడి : పామిడి దత్తాత్రేయ కాలనీలో కాపురముంటున్న నబీసాబ్‌ అనే వ్యాపారి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పెద్దవడుగూరు మండలం మల్లేలపల్లిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి నబీసాబ్‌ కుటుంబం వెళ్లింది. దీన్ని పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రూ.45 వేల నగదు సహా రెండు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఇంటికొచ్చిన నబీసాబ్‌కు తల

పామిడి : పామిడి దత్తాత్రేయ కాలనీలో కాపురముంటున్న నబీసాబ్‌ అనే వ్యాపారి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పెద్దవడుగూరు మండలం మల్లేలపల్లిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి నబీసాబ్‌ కుటుంబం వెళ్లింది. దీన్ని పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రూ.45 వేల నగదు సహా రెండు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఇంటికొచ్చిన నబీసాబ్‌కు తలుపుల బీగాలు ధ్వంసమై ఉండగా, ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన దుస్తులు, వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని గమనించారు. చోరీ జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement