ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు

ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు

యాదగిరిగుట్ట : జల యజ్ఞాన్ని ప్రవేశపెట్టి ధనయజ్ఞంగా మార్చింది మీరేనని కాంగ్రెస్‌ నాయకులనుద్దేశించి శనివారం ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ధ్వజమెత్తారు. యాదగిరిగుట్ట టీఆర్‌ఎస్‌ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను మింగిన కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోజూస్తున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి నేతనుల తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అల్డా చైర్మన్‌ పిచ్చిరెడ్డి, మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు సుమలత, జెడ్పీటీసీలు కర్రె కమలమ్మ, బోరెడ్డి జ్యోతిఅయోధ్యరెడ్డి, ఎంపీపీలు గడ్డమీది స్వప్న, కాసగల్ల అనసూయ, గుట్ట సర్పంచ్‌ బూడిద స్వామి, నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, గడ్డమీది రవీందర్‌గౌడ్, పడాల శ్రీనివాస్, ఆకవరపు మోహన్‌రావు తదితరులున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top