ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
టెక్కలి(శ్రీకాకుళం): ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఈ ఘటనలో ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక భూలోకమాతవీధికి చెందిన నవీన్‌కుమార్ ఆదివారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. నవీన్ ఆస్పత్రిలో చనిపోయాడు.
అయితే, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే చనిపోయాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. వారు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పటంతో విరమించారు. తిరిగి సోమవారం ఉదయం ఆస్పత్రి వద్దకు చేరుకుని నవీన్‌కు వైద్యం అందించిన వైద్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గటం లేదు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.