రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం | Road accident student dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Aug 13 2016 9:33 PM | Updated on Nov 9 2018 4:36 PM

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

రామవరం గ్రామ శివార్లలోని అయ్యప్ప ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుతుకులూరుకు చెందిన సబ్బెళ్ల సురేంద్రరెడ్డి(17) అనే విద్యార్థి మృతి చెందాడు.

రామవరం (బిక్కవోలు) :
రామవరం గ్రామ శివార్లలోని అయ్యప్ప ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుతుకులూరుకు చెందిన సబ్బెళ్ల సురేంద్రరెడ్డి(17) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం అనపర్తి నారాయణ జూనియర్‌ కళాశాలలో సురేంద్ర ఫస్టియర్‌ ఎంపీసీ విద్యార్థి. ఉదయం తన టూ వీలర్‌పై కళాశాలకు వెళుతుండగా, ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ మినీవ్యాన్‌ వేగంగా దూసుకువచ్చి అతడిని ఢీకొట్టి పక్కనే ఉన్న పంటబోదెలోకి పల్టీ కొట్టింది.

ప్రమాదంలో తలకు బలమైన గాయమైన సురేంద్ర ఆక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు హెచ్‌సీ సన్నిబాబు తెలిపారు. పుత్రశోకంతో ఉన్న సబ్బెళ్ల సూర్యనారాయణరెడ్డి, సుబ్బలక్ష్మి దంపతులను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌  డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు పరామర్శించి తమ సంతాపం  తెలిపారు. కాగా సురేంద్రరెడ్డి ఆ దంపతుల రెండో కుమారుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement