గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | road accident.. person dead | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Oct 20 2016 2:50 AM | Updated on Apr 3 2019 7:53 PM

తాళ్లపూడి : అన్నదేవరపేట పంచాయతీ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.

తాళ్లపూడి : అన్నదేవరపేట పంచాయతీ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.  స్థానికులు, తాళ్లపూడి పోలీసుల కథనం ప్రకారం.. గజ్జరం గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీను(40)కు మతిస్థిమితం లేదు.  15ఏళ్లుగా యాచకుడిగా జీవిస్తున్నాడు. మంగళవారం రాత్రి అతడు నడిచి వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో శరీరం మూడు భాగాలుగా విడిపోయింది. రెండు కాళ్లూ చెల్లాచెదురుగా పడ్డాయి. తాళ్లపూడి ఏఎస్సై మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement