సెల్‌ ఫోన్‌ దుకాణాలపై దాడులు | ridings on mobile shops | Sakshi
Sakshi News home page

సెల్‌ ఫోన్‌ దుకాణాలపై దాడులు

Aug 6 2016 11:29 PM | Updated on Sep 4 2017 8:09 AM

ఆమదాలవలస పట్టణంలోని పలు సెల్‌ఫోన్‌ దుకాణాలపై పైరసీ అధికారులు (ఐఎంఐ) యు.వి.సూర్యనారాయణ, బండారు జీవరత్నం శనివారం దాడులు నిర్వహించారు. మూడు సెల్‌ ఫోన్‌ దుకాణాల్లో కంప్యూటర్ల నుంచి మెమెరీ కార్డులకు అనధికారికంగా పాటలు ఎక్కిస్తున్నట్టు గుర్తించారు.

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని పలు సెల్‌ఫోన్‌ దుకాణాలపై పైరసీ అధికారులు (ఐఎంఐ) యు.వి.సూర్యనారాయణ, బండారు జీవరత్నం శనివారం దాడులు నిర్వహించారు. మూడు సెల్‌ ఫోన్‌ దుకాణాల్లో కంప్యూటర్ల నుంచి మెమెరీ కార్డులకు అనధికారికంగా పాటలు ఎక్కిస్తున్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల్లోని కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణాల యజమానులపై ఎస్‌ఐ కె. గోవిందరావు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా మేం ఏ అక్రమాలు చేయడంలేదని, ఏటా మా వద్ద నుంచి దుకాణానికి సుమారు రూ. 22 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని సెల్‌ఫోన్‌ దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
లైసెన్సు పేరుతో డీడీలు తీస్తున్న సొమ్ములు ఎవరికి చెందుతున్నాయోనని పోలీసులను ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తిని పిలిపించి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్‌ఐ సెల్‌ఫోన్‌ దుకాణదారులకు హామీ ఇచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement