విజయ్ జననాయగన్ లీక్ సీన్స్‌ కలకలం | Vijay Jananayagan leaked scenes create a stir in Tamilnadu | Sakshi
Sakshi News home page

విజయ్ జననాయగన్ లీక్ సీన్స్‌ కలకలం

Apr 12 2026 11:43 PM | Updated on Apr 13 2026 12:09 AM

Vijay Jananayagan leaked scenes create a stir in Tamilnadu

తమిళ స్టార్‌ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్‌ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి.  

కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్‌మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్‌లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. 

కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement