తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలి | Repay the loans | Sakshi
Sakshi News home page

తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలి

Sep 11 2016 12:11 AM | Updated on Sep 4 2017 12:58 PM

నాగర్‌కర్నూల్‌: మహిళా సంఘాల బలోపేతం కోసం ఆయా సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని డ్వామా పీడీ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సమీకృతభవనంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తే మరోసారి రుణాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు.

నాగర్‌కర్నూల్‌: మహిళా సంఘాల బలోపేతం కోసం ఆయా సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని డ్వామా పీడీ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సమీకృతభవనంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తే మరోసారి రుణాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు.  అనంతరం  ఆయా గ్రామాల మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఐకేపీ అధికారి శ్రీనువాసులు,సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement