పెచ్చురిల్లుతోన్న మతోన్మాదం | religious government | Sakshi
Sakshi News home page

పెచ్చురిల్లుతోన్న మతోన్మాదం

Jul 30 2016 10:34 PM | Updated on Mar 29 2019 9:04 PM

పెచ్చురిల్లుతోన్న మతోన్మాదం - Sakshi

పెచ్చురిల్లుతోన్న మతోన్మాదం

బీజేపీ అధికారం చేపట్టాక విశ్వవిద్యాలయాల్లో దాడులు పెరిగాయని, మతోన్మాదం పెచ్చురిల్లుతోందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. అరండల్‌పేటలోని అంబేడ్కర్‌భవన్‌లో సాధన ఆధ్వర్యంలో మనువాదం– మతోన్మాదం అంశంపై శనివారం సదస్సు జరిగింది.

దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు
గాంధీనగర్‌  :
 బీజేపీ అధికారం చేపట్టాక విశ్వవిద్యాలయాల్లో దాడులు పెరిగాయని, మతోన్మాదం పెచ్చురిల్లుతోందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు.  అరండల్‌పేటలోని అంబేడ్కర్‌భవన్‌లో సాధన ఆధ్వర్యంలో మనువాదం– మతోన్మాదం అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. భారతదేశంలో మొదటి శాస్త్రవేత్తలు చర్మకారులేనని చెప్పారు. ఉత్పత్తిలో భాగస్వాములైనవారు వెనుకబడిన కులాల వారేనన్నారు. ఉత్పత్తిలో ఏ మాత్రం ప్రాధాన్యతలేని అగ్రకులాలు మతన్మోద దాడులకు దిగడం సిగ్గుచేటని చెప్పారు. సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ రత్నం మాట్లాడుతూ విద్యార్థులు, స్కాలర్స్‌ హక్కుల కోసం పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. దురుద్ధేశంతోనే యూనివర్శిటీలో అంబేడ్కర్‌ సంఘం నాయకులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. యూనివర్శిటీలను మతోన్మాదానికి కేంద్రాలుగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రోహిత్‌ ఉదంతం ఇందులో భాగంగానే జరిగిందని చెప్పారు. రోహి™Œ lకుటుంబానికి న్యాయం జరిగే వరకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాషాయ మూకల దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు పద్మ, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్‌యూ కార్యదర్శి రవిచంద్ర, కేవీపీఎస్‌ నాయకులు మాల్యాద్రి, వినయ్‌కుమార్, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement