పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు | red sandalwood labour attacked by task force police | Sakshi
Sakshi News home page

పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు

Apr 30 2016 10:49 AM | Updated on Sep 3 2017 11:07 PM

చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులపైకి ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. దాదాపు 90 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తమిళ స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరాపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement