భూ వివాదం.. గన్ తో బెదిరింపులు! | realtor try to gun fire against other person | Sakshi
Sakshi News home page

భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!

Oct 2 2016 9:39 PM | Updated on Sep 4 2017 3:55 PM

భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!

భూ వివాదం.. గన్ తో బెదిరింపులు!

ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదం దాదాపు తుపాకీ కాల్పులవరకూ వెళ్లింది.

హైదరాబాద్: ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూ వివాదం దాదాపు తుపాకీ కాల్పులవరకూ వెళ్లింది. ఈ ఘటన నగరంలోని హిమయత్ నగర్ లో ఆదివారం చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తికి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కు మధ్య భూ వివాదాలు తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇద్దరూ గొడవకు దిగారు.

ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన రియల్టర్.. ఏకంగా తన వద్ద ఉన్న గన్ తో గొడవకు దిగిన అవతలి వ్యక్తిని కాల్చేందుకు యత్నించాడు. అయితే ఈ గొడవ గమనిస్తున్న స్థానికులు వెంటనే వారిద్దరిని వారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement