రాధిక, చక్రవర్తి అరెస్టుకు రంగం సిద్ధం | ready to areest radika and chakravarthy in child harrasment case | Sakshi
Sakshi News home page

రాధిక, చక్రవర్తి అరెస్టుకు రంగం సిద్ధం

Apr 22 2016 2:39 AM | Updated on Jul 30 2018 8:29 PM

రాధిక, చక్రవర్తి అరెస్టుకు రంగం సిద్ధం - Sakshi

రాధిక, చక్రవర్తి అరెస్టుకు రంగం సిద్ధం

చెప్పిన మాట వినటం లేదనే సాకుతో చిన్నారి ప్రియాంక అలియాస్ రేష్మాపై కర్కశంగా దాడికి పాల్పడిన చక్రవర్తి, రాధిక అలియాస్ రజియా సుల్తానా ల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.

చిన్నారిని చితకబాదిన ఫలితం..
‘సాక్షి’ శోధన నూటికి నూరు పాళ్లు నిజమని నిర్ధారణ
కథనం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

జిన్నారం : చెప్పిన మాట వినటం లేదనే సాకుతో చిన్నారి ప్రియాంక అలియాస్ రేష్మాపై కర్కశంగా దాడికి పాల్పడిన చక్రవర్తి, రాధిక అలియాస్ రజియా సుల్తానా ల అరెస్టుకు  రంగం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో  వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ప్రియాంక పై జరిగిన పాశవిక దాడితో పాటు బాలిక తల్లిదండ్రులుగా చెప్తున్న వ్యక్తుల గుట్ట రట్టు చేస్తూ  గురువారం  ‘సాక్షి’ జిల్లా టాబ్లాయిడ్‌లో ‘కర్కశం’  శీర్షికన ప్రచురితమైన పరిశోధనాత్మక కథనం ఇటు ప్రజల్లోనూ...

అటు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  ‘సాక్షి’  ఇచ్చిన ఆధారాతో పోలీసులు వాస్తవాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. చిన్నారి రేష్మాపై  చక్రవర్తి,  రజియా సుల్తాన్‌లు  చితకబాది, సిగరెట్‌తో వాతలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే అంశంపై విచారణ చేస్తున్నారు. చిన్నారిని చితక బాదటం వెనుక హత్యా కోణం ఏమైనా ఉందా? అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. చక్రవర్తికి సంబంధించిన ఓబైక్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement