ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో ఆర్డీఆర్‌ పూజలు | RDR puja in mutyalamma temple | Sakshi
Sakshi News home page

ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో ఆర్డీఆర్‌ పూజలు

Aug 20 2016 10:08 PM | Updated on Sep 4 2017 10:06 AM

ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో ఆర్డీఆర్‌ పూజలు

ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో ఆర్డీఆర్‌ పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ : పట్టణంలోని తాళ్లగడ్డలో గల ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శనివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సూర్యాపేట మున్సిపాలిటీ : పట్టణంలోని తాళ్లగడ్డలో గల ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శనివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి కరుణించి వర్షాలు పడి రైతులకు కలిసొచ్చి పంటలు పండేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలో నియోజకవర్గంలో అన్ని పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, బైరు వెంకన్నగౌడ్, బైరు శైలెందర్‌గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement