గేదె ఢీకొని ‘ఎయిర్‌ఫోర్స్‌’ కుమారుడి దుర్మరణం | ration dealer dead in road accident | Sakshi
Sakshi News home page

గేదె ఢీకొని ‘ఎయిర్‌ఫోర్స్‌’ కుమారుడి దుర్మరణం

Sep 21 2017 9:08 AM | Updated on Sep 2 2018 4:37 PM

జితేందర్‌రెడ్డి (ఫైల్‌), పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే - Sakshi

జితేందర్‌రెడ్డి (ఫైల్‌), పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

గేదె ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల పరిధి మొగలాయికోటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

కోదాడరూరల్‌ :  గేదె ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ  ఘటన అనంతగిరి మండల పరిధి మొగలాయికోటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన  ఎయిర్‌ఫోర్స్‌ వెంకటర్‌రెడ్డి కుమారుడు, స్థానిక రేషన్‌డీలర్‌ సింగారెడ్డి జితేందర్‌రెడ్డి(41) రాత్రి బుల్లెట్‌పై కోదాడకు వస్తుండగా గ్రామశివారులో గేదెను ఢీకొట్టడంతో కింద పడిపోయాడు.

దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆటోలు కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోని ఖానాపురం వద్ద మృతిచెందాడు. మృతదేహాన్ని బుధవారం కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వెంకట్‌రెడ్డి కుటుంబంలో విషాదం
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయిన వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ యన కు ఇద్దరు కుమారులు,కుమార్తె. 25ఏళ్ల క్రితం ఓ కుమారు డు కేన్సర్‌తో, ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో మరో కు మారుడు మృతిచెందడంతో విషాదం అలుముకుంది.

Advertisement
 
Advertisement
Advertisement