తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు | ranchal express train burnt at tuni | Sakshi
Sakshi News home page

తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు

Jan 31 2016 5:52 PM | Updated on Jul 30 2018 6:29 PM

తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు - Sakshi

తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

తుని: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన  ఉద్రిక్తంగా మారింది. తుని రైల్వే స్టేషన్లో ఆగిపోయిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్కు  ఆందోళన కారులు నిప్పుపెట్టారు. బోగీలన్ని మంటల్లో కాలిపోయాయి. అంతకుముందు రాళ్లు రువ్వడంతో ఇంజిన్ ధ్వంసమైంది.

ఆదివారం తునిలో ప్రారంభమైన కాపుగర్జనలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాస్తా, రైల్ రోకోలకు పిలుపునివ్వడంతో కోల్కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య రైళ్లు ఆగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement