వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా రాంరెడ్డి నియామకం | ramreddy appointed as a ysrcp dist secretary | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా రాంరెడ్డి నియామకం

Jul 26 2016 10:33 PM | Updated on May 29 2018 4:26 PM

వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా బి.రాంరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

సంగారెడ్డి టౌన్: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా బి.రాంరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన రాంరెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement