రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు | rains in coastal andrhra and telangana | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు

Jul 3 2016 9:13 AM | Updated on Sep 4 2017 4:03 AM

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement