24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు | Sakshi
Sakshi News home page

24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు

Published Wed, Aug 10 2016 10:07 AM

rains in coastal andhra pradesh

విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని అనుకుని  కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం మరింత బలపడి ఒడిశావైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది.

దీంతో రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.  
 

Advertisement
Advertisement