వర్ష సూచన | rain information | Sakshi
Sakshi News home page

వర్ష సూచన

May 12 2017 10:44 PM | Updated on Sep 5 2017 11:00 AM

రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగం శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి సమాచారం అందినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు రోజులూ ఆకాశం మేఘావృతమై 4 నుంచి 21 మిల్లీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. 

గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 39, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని పేర్కొన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 69 నుంచి 74, మధ్యాహ్నం 40 నుంచి 43 మధ్య ఉంటుందని,  గాలులు గంటకు 9 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement